
ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం
మోర్తాడ్(బాల్కొండ): లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లేఅవుట్ చేయని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు మొదటి దశ గడువులో ప్రజల నుంచి స్పందన లభించడంతో ఏప్రిల్ 30వ తేదీ వ రకు గడువు పొడిగించింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ ద రఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో భూమి విలువ మేరకు ఫీజు నిర్ణయించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రభుత్వ ఖజానాకు ఆదా యం సమకూరుతుండడంతో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులో 25 శాతం రాయితీ కల్పించింది. ఇందులో భాగంగా మొదటి విడత గడువు గడిచిన మార్చి 31తో ముగిసింది. మిగిలిన దరఖాస్తుదారు ల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
వేలల్లో దరఖాస్తులు..
ఎల్‌ఆర్‌ఎస్ కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. నుడాతోపాటు నిజామాబాద్ కార్పొరేషన్, భీమ్‌గల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో చాలా మంది ఇండ్ల స్థలాలకు ఫీజును చెల్లించారు. కాగా, దరఖాస్తులను మూడు దశల్లో పరిశీలన చేసిన తర్వాత అధికారులు ప్రొసీడింగ్‌లు జారీ చేయనున్నారు.
మోర్తాడ్‌లో లే అవుట్ చేయని ఇంటి స్థలాలు
నిజామాబాద్‌లో 33,729 దరఖాస్తులు
నిజామాబాద్ సిటీ: ఎల్‌ఆర్‌ఎస్ కోసం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 33,729 దరఖాస్తులు వ చ్చాయి. ఇప్పటి వరకు 23,066 దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూ రు చేశారు. వారికి ఫోన్లు చేసి సంబంధిత రుసు ము చెల్లించుకోవాలని సూచించగా, 4,078 మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు బల్దియాకు రూ.29.81 కో ట్ల ఆదాయం వచ్చింది. కాగా, ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరివి తిరస్కరణకు గురయ్యాయి. సరైన డాక్యుమెంట్లు లేకపోవడం, ప్లాట్ నాలాలు, ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, గ్రీన్‌జోన్‌లోకి వచ్చే స్థలాలు, మాస్టర్ ప్లాన్‌లోకి వచ్చే భూ ములు, పార్కు స్థలాలు, వంటి సమస్యాత్మక స్థ లాలకు మాత్రం అనుమతులు నిలిచినట్లు అధి కారులు తెలిపారు. ‘ చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను వినియోగించుకోలేదు. ప్రభుత్వం ఇచ్చి న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాసు తెలిపారు.
ఈ నెలాఖరు వరకు గడువు పొడిగింపు
25 శాతం రాయితీతో
ఫీజు చెల్లింపునకు అనుమతి
రాయితీ సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో ఫీజును చెల్లించాలి. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తుంది.
– శ్రీధర్, ఎంపీవో, మోర్తాడ్
ప్రజల అభ్యర్థన మేరకు.. : కలెక్టర్ హనుమంతు
నిజామాబాద్ అర్బన్: అనధికార లేఔట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31నాటితో గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పొడిగించిందని అన్నారు. అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు.