
నేడు ఈద్– ఉల్– ఫితర్
నిజామాబాద్ రూరల్: కఠిన నియమాలతో నెలరోజులపాటు ఉపవాస దీక్ష పాటించిన ముస్లిము లు సోమవారం ఈద్–ఉల్–ఫితర్ నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ పండుగకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూపా ర్క్, పాత బస్టాండ్, గాంధీచౌక్, అహ్మదీబజార్ తదితర ప్రాంతాల్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. రంజాన్ సామూహిక ప్రార్థనల కోసం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న కచియా మసీద్, ఖిల్లా ప్రాంగణంలోని జామా మసీదు, ఇతర ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి.
ఈద్గాలను పరిశీలించిన సీపీ
ఖలీల్‌వాడి: రంజాన్ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీద్‌లను సీపీ పోతరాజు సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మత పెద్దలతో మాట్లాడారు. డివిజన్ పరిధిలో దాదాపు 450 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎస్సైలు, ఈద్గా పెద్దలు ఉన్నారు.
సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి
శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ముస్లిములు అదే స్ఫూర్తితో సోమవారం ఈద్–ఉల్–ఫితర్‌ను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.

నేడు ఈద్– ఉల్– ఫితర్