
నిజామాబాద్‌నాగారం: ఇందూరు నగరంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో హనుమాన్ బ్రహ్మోత్సవం సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించి మంగళవారం వీర హనుమాన్ విజయ యాత్ర ప్రచార మాధ్యమాలు ఆటో స్టిక్కర్స్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. 23న నీలకంఠేశ్వరుని ఆలయం నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత భారీ బహిరంగ సభతో ఆర్‌ఆర్ చౌరస్తాలో యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రలో హిందూ బంధువులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, బజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు బినయ్, శైలేష్, శివాజీ యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, తదితరులున్నారు.