‘సీఎం క్షమాపణ చెప్పాలి’
నిర్మల్‌చైన్‌గేట్: సీఎం రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లను అవమానపరిచారని, హిందూ సమాజాన్ని కించపరిచారని ఆరోపిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజే పీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే క్రమంలో ఏఎస్పీ ఉపేందర్‌రెడ్డి, పలువు రు సిబ్బంది బూట్లకు మంటలు అంటుకోవడంతో వారు పరుగులు తీయడం గమనార్హం. కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, ఆకుల కార్తిక్, సుంకరి సాయి, ఒడిసెల అర్జున్, భాస్కర్, నరేశ్, రాజు, నారాయణగౌడ్, సుధాకర్, సత్యనారాయణ, రాజేందర్, శ్రావణ్, విజయ్, ప్రసాద్, రాజు, రంజిత్, దిలీప్, సాత్విక్, రాము, మహేశ్, రవి, లింగం, బంటి తదితరులు పాల్గొన్నారు.


