దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపా రు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. రాయితీ రుణాలు పొంది వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. జిల్లాలో 10భవిత కేంద్రాలను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని కేంద్రాలు ఆధునికీకరించడంతోపాటు ఫిజియోథెరపిస్ట్‌లను అందుబా టులోకి తీసుకువస్తామని తెలిపారు. అర్హులైన ది వ్యాంగులకు యూడీఐడీ కార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు న్యాయ నిపుణులు, ఎన్జీవోలతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ రాధిక, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, దివ్యాంగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి
జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌక్ సమీపంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీ లించి మాట్లాడారు. మినీ ట్యాంక్ బండ్ నుంచి ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఫుట్‌పాత్‌కు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో నిరంతరం పారిశుధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటా లని సూచించారు. ఆటో స్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇటీవల నిర్మాణం పూర్తయిన మినీ ట్యాంక్ బండ్ పార్కును పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, టౌన్ ప్లానింగ్ అధికారి హరిభువన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చెరువులో చేపపిల్లల విడుదల
నిర్మల్ రూరల్: నిర్మల్ మండలం డ్యాంగాపూర్ చెరువులో కలెక్టర్ అభిలాష అభినవ్ చేప పిల్లలు విడుదల చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులున్నారు.


