బకాయిలు విడుదల చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: పీఏసీఎస్, ఎఫ్‌ఏసీఎస్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మొక్కజొ న్న బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. బుధవారం ఆయనను కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని రై తుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించి రూ.20కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. స్పందించిన సుదర్శన్‌రెడ్డి సీఎం పేషీలో మాట్లాడి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.


