నిర్మల్
8లోu
న్యూస్‌రీల్
ఢిల్లీ స్థాయికి ఎదిగిన పల్లె నేతలు ఆదర్శంగా నిలిచిన నర్సన్నబాపు గడ్డెన్నకాకా కుటుంబంలో ముగ్గురు.. డిప్యూటీ స్పీకర్‌గా అయిండ్ల భీంరెడ్డి పంచాయతీ నుంచి పెద్దపదవుల దాకా..
ఎన్నికల సామగ్రి పరిశీలన
ఖానాపూర్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం జెడ్పీ సీఈవో శంకర్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో రత్నాకర్‌రావు, సిబ్బంది జెడ్పీ సీఈవోను శాలువాతో సన్మానించారు.
నిర్మల్: సర్పంచ్.. ఊరు చిన్నదైనా ఈ పదవి పెద్ద ది. గ్రామానికి దిశానిర్దేశం చేసే పదవి మాత్రమే కాదు. నేతగా ఉన్నతస్థాయికి అంచెలంచెలుగా ఎదగడానికి ఓ రకమైన రాజకీయ అరంగేట్రమిది. పల్లె పాలనతో ఓనమాలు నేర్చి ఢిల్లీ దాకా ఎదిగిన నేతలెందరో ఉన్నారు. పంచాయతీలో ఎదురైన అనుభవాలతో తమ రాజకీయ జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకున్న పాలకులూ జిల్లాలో ఉన్నారు. జి ల్లాలోనూ ఇలాంటివారు చాలామందే ఉన్నారు. అ ప్పటి నేతల పనితీరే.. వారిని పంచాయతీ నుంచి పైస్థాయికి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు.
ఆదర్శం నర్సన్నబాపు
పొద్దుటూరి నర్సారెడ్డి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలియదు. అదే.. నర్సన్నబాపు అనగానే టక్కున ‘అరె.. బాపు గురించి తెలియకపోవడమేంది..’ అని గొప్పగా చెబుతారు. సారంగపూర్ మండలం మలక్‌చించోలికి చెందిన నర్సన్నబాపు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇందులో ఒకసారి ఏకగ్రీవంగా గెలు పొందడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా వ్యవహరించా రు. రాష్ట్ర భారీ నీటిపారుదల, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేశారు. 1989లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఈస్థాయికి ఎదిగిన నర్సన్నబాపు రాజకీయ జీవితానికి తొలి పునాది మలక్‌చించోలి గ్రామ సర్పంచ్ పదవే కావడం విశేషం. అంత ఎదిగినా.. నర్సన్నబాపు తన వారసులనూ రాజకీయరంగంలోకి తీసుకురాకపోవడం గమనార్హం.
గడ్డెన్నకాకా కుటుంబంలో ముగ్గురు..
కాకా.. అంటూ ముధోల్ నియోజకవర్గ ప్రజలు ప్రేమగా పిలుచుకునే నేత గడ్డెన్న. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఏ స్థాయికి ఎదిగినా పల్లెనేతగానే ఆయన పేరొందారు. భైంసా మండలం దేగాం సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తండ్రి అడుగుజాడల్లోనే మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సర్పంచ్ పదవి నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టా రు. రెండుసార్లు మార్కెట్ కమి టీ చైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గడ్డెన్న మరో కుమారుడు గోపాల్‌రెడ్డి కూడా దేగాం సర్పంచ్‌గా పనిచేయడం విశేషం.
డిప్యూటీ స్పీకర్‌గా భీంరెడ్డి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన ఘనత అయిండ్ల భీంరెడ్డికే దక్కుతుంది. లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మల్లాపూర్, మాచాపూర్‌లు కలిపి ఉన్న పంచాయతీకి భీంరెడ్డి సర్పంచ్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983లో ఎమ్మెల్యేగా గెలిచి స్వల్ప కాలమే పదవిలో ఉన్నా.. డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన కుమార్తె డాక్టర్ స్వర్ణారెడ్డి 2018లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. ఇలా జిల్లాకు చెందిన ఎందరో నేతలు సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించి ఉన్నత పదవులు అధిరోహించారు.
నర్సారెడ్డి
మాజీ మంత్రి
రాజేశ్వర్‌రావు
సమితి మాజీ అధ్యక్షుడు
గడ్డెన్న
మాజీ మంత్రి
నారాయణరెడ్డి
సమితి మాజీ అధ్యక్షుడు
విఠల్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే
సత్యనారాయణగౌడ్
మాజీ ఎంపీపీ
భీంరెడ్డి
మాజీ డిప్యూటీ స్పీకర్
జిల్లాలో చాలామంది కొత్త, పాత నేతలు సర్పంచ్ పదవి నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉన్నతంగా ఎదిగారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో పదవులను విజయవంతంగా నిర్వర్తించారు.
ఇలా మరి కొందరు..
కామాంధులకు ఉరే సరి..!
చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడుతున్నవారికి ఉరిశిక్ష వేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే ఘటనలు ఆగుతాయని భావిస్తున్నాయి.
నిర్మల్
నిర్మల్


