
గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్
సోన్: మండలంలోని గాంధీనగర్‌లో బుధవా రం కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 102 బైక్‌లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని ధ్రువపత్రాలు చూపించి తీసుకువెళ్లాలని సూచించారు. వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడవద్దని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించవద్దని, వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని సూచించారు. సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సైలు గోపి, సుప్రియ, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.