
ఫీజుల నియంత్రణపై ఫోకస్
నిర్మల్
దసలిపట్టుతో వస్త్రం
దసలి పట్టుకాయ దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న చెన్నూర్ పట్టుపరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. పట్టు దారం, వస్త్రోత్పత్తికి కూడా సన్నద్ధమవుతోంది.
● భారమవుతున్న ‘ప్రైవేట్’ చదువులు ● రోజురోజుకూ పెరుగుతున్న ఫీజులు ● నియంత్రణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ● మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటనపై హర్షం
ఎర్త్ రాడ్లతో ముప్పు
విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్త్ కోసం ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు ప్రమాదకరంగా మారాయి. గమనించకుంటే పశువులతోపాటు మనుషులూ బలవుతున్నారు.
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025
8లోu
హెలిప్యాడ్ పరిశీలన
భైంసాటౌన్: పట్టణంలోని పార్డి(బీ) బైపాస్‌రోడ్ లో గల హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల బుధవారం పరిశీలించారు. కుంటాలలో భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో ఈనెల 16న రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భైంసాలో హెలీప్యాడ్ స్థలం పరిశీలించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఏఎస్పీ అవినాష్‌కుమార్, ఆర్డీవో కోమల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈఈ సునీల్ ఉన్నారు.
రేపు కుంట్రాలకు ‘పొంగులేటి‘
కుంటాల: భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం కుంటాలకు రానున్నారు. స్థానిక ము న్నూరు కాపుసంఘ భవనంలో బుధవారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వారి వెంట ఏఎస్పీలు రాజేశ్ మీనా, అవినాష్‌కుమార్, భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సై అశోక్ ఉన్నారు.
నిర్మల్‌ఖిల్లా: ‘ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాల అభిప్రాయాలు సేకరించాం. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది’ ఇవి.. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈనెల 12న ‘విద్యా రంగంలో సంస్కరణ లు’ అంశంపై మంత్రివర్గ సబ్‌కమిటీ, విద్యాశాఖ ఉ న్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. తల్లిదండ్రుల ఆ శలను అ వకాశంగా మ లుచుకున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు వివిధ పేర్లతో బురిడీ కొట్టిస్తున్నాయి. దీంతో అ త్యాశకు పోతున్న త ల్లిదండ్రులు లక్షలు కుమ్మరిస్తూ భారం భ రిస్తున్నారు. టాలెంట్, టె క్నో, ఈ–టెక్నో, డీజీ, ఒలింపియాడ్, మోడల్ స్కూల్, ఐఐటీ, జేఈ ఈ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ 665 గుర్తింపు పొందిన ప్రైవేట్
పాఠశాలున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 194, ఆదిలాబాద్‌లో 151, మంచిర్యాలలో 218, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 102 ప్రైవేట్ బడులున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా 1నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య సు మారు 5లక్షల వరకు ఉండగా, ఇందులో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు 2లక్షలకు పై గా ఉన్నారు. ప్లే, టెక్నో, ఇంటర్నేషనల్, ఈ–టెక్నో, ఒలింపియాడ్ తదితర పేర్లతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎల్‌కేజీ చదువుకే వేలల్లో ఫీజు వసూలు చేస్తున్నాయి. దాదాపు 50 శాతానికంటే ఎక్కువే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సర్కారు ఫీజుల నియంత్రణకు పూనుకోగా తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రూ.లక్షల్లో చెల్లిస్తున్నాం
ఏటా రూ.లక్షా 50 వేల కు పైగా మా పిల్లల ఫీ జులు చెల్లిస్తున్న. ఏటేటా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రా ష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది.
– ఆకుల భూమేశ్, ఈద్‌గాం, నిర్మల్
సంపాదనలో సగం చదువులకే..
ప్రైవేట్‌గా ఉపాధి పొందుతూ సంపాదిస్తున్న అరకొర వేతనాల నుంచి 50 శాతానికిపైగా డబ్బు పిల్లల ఫీజుల కోసమే ఖర్చు చేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఇష్టారీతిన పెంచకుండా ప్రభుత్వం నియంత్రించాలి.
– మార్గం శ్రీనివాస్, నిర్మల్
కఠినంగా వ్యవహరించాలి
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు పుస్తకాలు, యూని ఫామ్, అడ్మిషన్ ఫీజుల పేరిట తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ‘ప్రైవేట్’ యాజమాన్యాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి.
– కై రి శశి, ఏబీవీపీ నేత, నిర్మల్
న్యూస్‌రీల్
ఏటా పెంచేస్తున్నారు
ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులతో సామాన్యులకు ‘బడి’ భారమవుతోంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అమలు చేయాల్సి ఉండగా అధికారుల అలసత్వంతో ఫీజుల పెంపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా ఏటా ప్రైవేట్ పాఠశాలల్లో 10–30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు.
నిర్మల్: 194 ఆదిలాబాద్: 151
కు.ఆసిఫాబాద్: 102 మంచిర్యాల: 218
ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తాం
ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో ని ఫీజుల నియంత్రణపై చర్చ జరిగింది. విద్యాశా ఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫీజుల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తాం. రానున్న విద్యాసంవత్సరం నుంచి నిర్ణీత ఫీజుల క న్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– పీ రామారావు, డీఈవో

ఫీజుల నియంత్రణపై ఫోకస్

ఫీజుల నియంత్రణపై ఫోకస్

ఫీజుల నియంత్రణపై ఫోకస్

ఫీజుల నియంత్రణపై ఫోకస్

ఫీజుల నియంత్రణపై ఫోకస్