
‘పనిచేసే వారికే పదవులు’
ఖానాపూర్: పార్టీ కోసం పనిచేసిన వారికే పార్టీ సంస్థాగత, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉమ్మడి జిల్లా పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్, అవేజ్‌ఖాన్ పేర్కొన్నారు. పట్టణంలోని జేకే ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృత స మావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎస్సీ రిజ ర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన ఘన త కాంగ్రెస్‌దేనని చెప్పారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం అయ్యేలా పార్టీ కోసం ప్రభుత్వంలో పని చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ స మావేశానికి గైర్హాజరయిన మండల బాధ్యులపై చ ర్యలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులను కోరారు. ఉమ్మడి జిల్లాకు నామినేటెడ్ పదవులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొందరు కోవర్టులతో పార్టీ అబాసు పాలవుతోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపుని చ్చారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, ప్రజాప్రతినిదులు, నాయకులు అడ్డి భోజారెడ్డి, తహర్‌బిన్ అ హ్మద్, అజ్మీరా శ్యాంనాయక్, భూమన్న, ముకాడే, విశ్వనాథ్, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, ఇక్బాల్, మాజిద్, తరి శంకర్, దుర్గా భవాని, చిన్నం సత్యం, ఏ రాజెందర్, పీ సతీశ్‌రెడ్డి, ఇసాక్, దయానంద్, స్వప్నిల్‌రెడ్డి, నిమ్మల రమేశ్, షబ్బీర్‌పాషా, సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.