
‘ఆదర్శ’ ఫలితాలు విడుదల
కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇటీవల 6వ తరగతి నుంచి పదో తరగతి ఖాళీల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు సోమవారం రాత్రి విడుదల చేసినట్లు కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ న వీన్‌కుమార్ తెలిపారు. విద్యార్థుల మార్కులు, ర్యాంకుల వివరాలు telanganams. cgg. gov. in/ TGMS WEB/20# వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. సీటు వచ్చిన విద్యార్థుల జాబితాను త్వరలో పాఠశాలల్లో ప్రదర్శిస్తామని తెలిపారు.
లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించాలి
భైంసాటౌన్: పట్టణంలోని కోర్టు ఆవరణలో ఈనెల 16న జాతీయలోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి దేవేంద్రబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ లోక్‌అదాలత్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా చూడాలని సూచించారు. సమావేశంలో ఏపీపీ అరుణ, సీఐలు గోపీనాథ్, నైలు, ఎకై ్సజ్ సీఐ నజీర్‌హుస్సేన్, ఎస్సైలు పాల్గొన్నారు.
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం
డీఏవో అంజి ప్రసాద్
కుంటాల: రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏవో అంజి ప్రసాద్ తెలిపారు. కుంటాలలో మార్క్‌ఫెడ్ సౌజన్యంతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. మోతాదుకు మించి ఎరువులు వాడడంతో కలిగే అనర్థాలను వివరించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్నలు కొనుగోలు చేయవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏవో విక్రమ్, సీఈవో మురళీ కృష్ణ, ఏఈవోలు గణేశ్, శ్రీనివాస్, రైతులు ఉన్నారు.