
ఉపాధ్యాయులు బోధన మెరుగుపర్చుకోవాలి
● డీఈవో రామారావు
నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు తమ బోధనా విధానాన్ని మెరుగుపర్చుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు నిర్వహించే శిక్షణను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయుల చేతుల్లోనే భావిభారత ప్రగతి ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఐదు రోజుల శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. డీఆర్పీలు హైదరాబాద్‌లో శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయుల అభ్యసన ఫలితాలు విభిన్న బోధనా మెలకువలు, డిజిటల్ బోధన, కృత్రిమ మేధ ఉపయోగించి అభ్యాసాలు కల్పించడం, జీవన నైపుణ్యాలు అందించడం, పనితీరు మెరుగుపరుచుకోవడం, నూత న సాంకేతికలు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి వివరాలు అందిస్తారన్నారు. వీటన్నింటినీ ఉపాధ్యాయులు అవగాహన చేసుకుని తమ తరగ తి బోధనలో వినియోగించుకోవాలని సూచించా రు. ఐదు రోజుల శిక్షణను నారాయణ స్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ,గణితం, ఎస్జీటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు చాణ క్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు సమయానికి హాజరై, సమయపాలన పాటించి షెడ్యూల్ ప్రకారం శిక్షణలో పాల్గొనా లని సూచించారు. ఎంఈవో రమణారెడ్డి, అకడమి క్ మానిటరింగ్ అధికారి నర్సయ్య, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రవీణ్‌కుమార్, ఆయా సబ్జెక్టుల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.