
అడ్మిషన్ల కోసం ‘సర్కారు’ ప్రచారం
ఖానాపూర్: ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించాలని ఉపాధ్యాయులు గ్రా మాల్లో ప్రచారం చేస్తున్నారు. మండలంలోని మ స్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులను చేర్పించా లని మస్కాపూర్, ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చే శారు. మస్కాపూర్ పాఠశాలలో 129 మంది విద్యార్థులకు పది పరీక్షల్లో 128 మంది ఉత్తీర్ణత సాధించారని హెచ్‌ఎం నరేందర్‌రావు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 50మందికి పై గా 500కు పైగా, 20 మంది 540కి పైగా మార్కులు సాధించారని అవగాహన కల్పించారు.