
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
● జానకి షర్మిల
నిర్మల్‌టౌన్: పోలీసులు సమయపాలన పాటిస్తూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది డ్యూటీలపై రివ్యూ చేశారు. పోలీసులు క్రమశిక్షణతో అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ.. తమ కు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విధుల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీతి నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించా రు. ప్రజలు, గ్రామ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలా పాల సమాచారం సేకరించాలని తెలిపారు. ఇందులో ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.