
గల్ఫ్ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
● ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్ల
నిర్మల్‌ఖిల్లా/సారంగపూర్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన సారంగాపూర్ మండలం మలక్‌చించోలి గ్రామానికి చెందిన కుర్మే దేవన్న(51)గత గురువారం అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని అతను పనిచేసే కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది. దేవన్న మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి తెప్పించే ఏర్పాట్లు చేస్తామని ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్ల తెలిపారు. ఈ మేరకు శనివారం మృతుడి కుటుంబీకులు జిల్లాకేంద్రంలో స్వదేశ్‌ను కలిసి దేవన్న వివరాలు అందించారు. తక్షణమే దుబాయ్ ఎంబసీకి సమాచార మందించి ఇండియాకు మృతదేహం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.