
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్
కడెం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని లింగాపూర్ కొనుగోలు కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీఎస్‌ఎస్ గోదాంలో గన్నీ సంచుల స్టాక్‌ను, కొనుగోళ్ల రికార్డులను పరిశీలించారు. గన్నీ సంచుల కొరత లేదని, తూకం చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌరసరాఫరాల సంస్థ మేనేజర్ సుధాకర్, డీఎస్‌వో పాపయ్య, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్‌ఐ శారద ఉన్నారు.
ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలి
దస్తురాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని రేవోజీపేట కొనుగోలు కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురిసే ఆవకాశం ఉన్నందున కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు గన్నీ సంచులు ఇవ్వడం లేదని అదపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాయిశ్చర్ వచ్చినా తూకం వే యడం లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు కల్లాలో పోసిన ధాన్యం రిజిస్టర్‌ను, ధాన్యం మాయిశ్చర్‌ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ సీఈవో రాజేందర్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఎస్‌వోను ఆదేశించారు. మాయిశ్చర్ వచ్చిన ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి