
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నిర్మల్‌చైన్‌గేట్: పెంబి మండలం గుమ్మెన కోలంగూడ గ్రామ సమస్యలు పరిష్కరించాలని తెలంగా ణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 50 ఏళ్లుగా 100 కుటుంబాలవారమంతా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి తాగడానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని కోరారు. సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తమ భూములకు లావుని పట్టా, అటవీ హక్కులు కలిగి ఉన్నా ఫారెస్ట్ అధికారులు గ్రామాభివృద్ధికి అడ్డుపడుతూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గుమ్మెన కోలంగూడ గ్రామస్తులు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.