
సామాన్యులకు అండగా పోలీసులు
● ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు ఠాణా లో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
సామరస్యంగా
పరిష్కరించేందుకు కృషి చేయాలి
జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులకు ఆన్‌లైన్‌లో దిశా నిర్దేశం చేశారు.