
విధి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
సారంగపూర్: విధి ఫౌండేషన్ హైదాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సీసీఎఫ్ శరవణన్ అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చించోలి(బి) గ్రామ సమీపంలోని గండిరామన్న హరితవనంలో పనిచేసే ప్రొటెక్షన్ వాచర్లకు శనివారం బ్యాగులు, యూనిఫాం, షూస్, లాఠీలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి ఎన్‌జీవో ద్వారా నిర్మల్ జిల్లాలోని బుర్ఖాలెగిడి అనే ఆదివాసీ గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడి పాఠశాలలో కావాల్సిన ప్రాథమిక వసతులు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, డ్రాపవుట్ విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. పర్యావరణం, విద్య, ఉపాధి, ఆరోగ్యం అంశాలపై సంస్థ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణుల దాహార్తి తీర్చడానికి రూ.50 వేలతో నీటి చెలిమలను తవ్వించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విధి ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ ధీరజ్ కావేరి, డాక్టర్ విజయ కావేరి, టాస్క్‌ఫోర్స్ ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్, మామడ రేంజ్ ఎఫ్‌ఆర్‌వో అవినాష్, సారంగాపూర్ డీఆర్‌వో నజీర్‌ఖాన్, ఎఫ్‌ఎస్‌వో వేణుగోపాల్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్‌లైన్ పనులు పరిశీలన
మండలంలో కౌట్ల(బి) అటవీ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్ నంబరు 1024 మీదుగా వెళ్తున్న పవర్‌గ్రిడ్ 765 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణ పనులను సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్‌వో నాగినిభాను సిబ్బందితో కలిసి శనివారం పరిశీలించారు. వార్దా నుంచి హైదరబాద్ వెళ్లే ఈవిద్యుత్‌లైన్ పనులు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా.. లేదా అనే విషయాలను పవర్‌గ్రిడ్ సిబ్బంది, స్థానిక అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీప్రాంతంలో నిబంధనలకు లోబడి పనులు చేయించాలని ఆదేశించారు. అగ్రిమెంట్‌లో పేర్కొన్న విధంగానే పనులు ఉండాలని తెలిపారు. అటవీ ప్రదేశాలు చెడిపోకుండా జాగ్రత్తగా పనులు జరిగేలా నిత్యం పరిశీలించాలని అటవీ సిబ్బందికి సూచించారు. అనంతరం అటవీ ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట డీఆర్‌వో నజీర్‌ఖాన్, ఎఫ్‌బీవో వెన్నెల తదితరులు ఉన్నారు.
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్
పార్కు సిబ్బందికి యూనిఫాం,బ్యాగులు, లాఠీ పంపిణీ

విధి ఫౌండేషన్ సేవలు అభినందనీయం