
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నా రు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రాక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల తలభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదావరి ఒడ్డున కుప్పలుగా ఉన్నా యి. ప్రస్తుతం పురాతన ఆలయం ఉన్నచోట గ్రా మానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్‌కుమార్ తెలిపారు.

ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..