కేజ్రీవాల్ అరెస్టుపై 'శర్మిష్ట ముఖర్జీ' కీలక వ్యాఖ్యలు | Pranab Mukherjee Daughter Tweet On Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ అరెస్టుపై 'శర్మిష్ట ముఖర్జీ' కీలక వ్యాఖ్యలు

Mar 22 2024 2:49 PM | Updated on Mar 22 2024 3:40 PM

Pranab Mukherjee Daughter Tweet On Arvind Kejriwal - Sakshi

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్‌'ను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె 'శర్మిష్ట ముఖర్జీ' స్పందించారు. గతంలో కేజ్రీవాల్, అన్నా హజారే బృందం ఢిల్లీ మాజీ సీఎం కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌పై బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు.

దీక్షిత్‌కు వ్యతిరేకంగా ట్రంక్ లోడ్ సాక్ష్యాలు ఉన్నాయని తమ వాదనలు వినిపించారు. అయితే అలాంటి సాక్ష్యాలను ప్రజలకు అందించలేదని ఆమె తెలిపారు. గతంలో వారు చేసిన విపరీత చర్యలే వారిని కర్మగా వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement