Covid 19: బెంగళూరుకు ఉపశమనం | Karnataka: Records 3203 Covid New Cases 676 From Bengaluru Urban | Sakshi
Sakshi News home page

Covid 19: బెంగళూరుకు ఉపశమనం

Jul 2 2021 5:54 PM | Updated on Jul 2 2021 5:58 PM

Karnataka: Records 3203 Covid New Cases 676 From Bengaluru Urban - Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 3,203 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,47,013కు పెరిగింది. 94 మంది కోవిడ్‌ కాటుకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 35,134కు చేరింది. కొత్తగా 14,302 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  

65 వేలకు యాక్టివ్‌ కేసులు..  
ఇప్పటివరకు మొత్తం 27,46,544 మంది కోలుకోగా, యాక్టివ్‌ కేసులు 65,312 కి దిగివచ్చాయి. కొత్తగా 1,56,078 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివిటీ రేటు 2.05 శాతం, మరణాల రేటు 2.93 శాతంగా నమోదయింది.  

బెంగళూరుకు ఉపశమనం..   
రాజధాని నగరంలో కరోనా ఉధృతి మరింత తగ్గింది. 676 కేసులు మాత్రమే వచ్చాయి. 18 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసులు 12,14,235 కి, డిశ్చార్జ్‌లు 11,65,074 కి పెరిగాయి. ఇంకా 33,516 మంది చికిత్స పొందుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement