Andaman Islands Earthquake: అండమాన్‌లో భూకంపం.. | Earthquake Strikes Andaman Islands | Sakshi
Sakshi News home page

Andaman Islands Earthquake: అండమాన్‌లో భూకంపం..

Jan 10 2024 11:29 AM | Updated on Jan 10 2024 11:40 AM

Earthquake Strikes Andaman Islands - Sakshi

ఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. కాగా, రికార్ట్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదు అయినట్టు  నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

వివరాల ప్రకారం.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈ సందర్భంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, తీవ్ర ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. 2024 ఏడాది ప్రారంభంలోనే జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

Advertisement
 
Advertisement
Advertisement