పోస్టల్ బ్యాలెట్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు
నారాయణపేట/మరికల్: పోస్టల్ బ్యాలెట్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎన్నికల అధికారులకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల పోస్టల్ బ్యాలెట్ వినియోగం, లెక్కింపు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అధికారులకు అప్పగించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ పాల్గొన్నారు.
● మరికల్‌లోని నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించారు. కేంద్రంలోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించొద్దని అధికారులకు సూచించారు. సర్పంచ్, వార్డు స్థానా లకు వచ్చిన నామినేషన్ల వివరాలను తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ పృథ్వీరాజ్, పంచాయ తీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రెడ్డి ఉన్నారు.


