ఊపందుకున్న నామినేషన్లు
● రెండోరోజు సర్పంచ్ స్థానాలకు 202 నామినేషన్లు దాఖలు
నారాయణపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు సర్పంచ్‌కు 59, వార్డులకు 59 నామినేషన్లు రాగా రెండోరోజు పెరిగాయి. ఆశావహులు తమ మండలంలోని క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. సర్పంచ్ స్థానాలకు సోమవారం 202 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 454 దాఖలైనట్లుగా జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.


