గ్రామాన్ని ఎడారిగా మారిస్తే ఊరుకోం.. | - | Sakshi
Sakshi News home page

గ్రామాన్ని ఎడారిగా మారిస్తే ఊరుకోం..

Jul 7 2025 6:08 AM | Updated on Jul 7 2025 6:08 AM

గ్రామాన్ని ఎడారిగా మారిస్తే ఊరుకోం..

గ్రామాన్ని ఎడారిగా మారిస్తే ఊరుకోం..

మాగనూర్‌: మాగనూర్‌ గ్రామానికి ప్రధానంగా సాగు, తాగునీరు అందిస్తున్న పెద్ద వాగులో ఇసుక తరలిస్తే గ్రామం ఎడారిగా మారుతుందని, వారం రోజులుగా ఈ విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈమేరకు గ్రామస్తులంతా సమావేశమై ఇసుక తరలింపునకు వ్యతిరేకంగా తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాగనూర్‌ వంతెన దగ్గర ఇసుక తరలించవద్దని కోరినా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో భాగంగా శనివారం మళ్లీ అధికారులు ఇసుక తరలించేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని , ప్రతి రోజు ఇదే విధంగా ఇసుక రవాణాను అడ్డుకోవడం అంటే ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ఇకనైనా అధికారులు మరో చోట ఇసుక తరలించేలా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రయత్నం వి రమించుకోవాలని లేదంటే ఉద్యమాలకై న సిద్ధంగా గ్రామస్తులు ఏకతాటిపై ఉంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement