కేసీ రైతులు వరి సాగు చేయొద్దు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. ఎస్సార్బీసీ ద్వారా రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ పరిధిలో మార్చి 31 వరకు సాగునీరు అందించే వీలుందన్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం మండలంలోని వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాల్లో వరి సాగు ప్రారంభమైనప్పటికీ, దిగువనున్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వరి సాగునీరు ఇవ్వడం సమస్యగా ఉన్న కారణంగా ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందిస్తున్నామన్నారు. కేసీ 0–120 కి.మీ పరిధిలోని మల్యాల, ముచ్చుమర్రిలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు అందించే అవకాశం చాలా తగ్గిపోయిందని, ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు వేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
● జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్ భారీగా వర్షాలు పడి రిజర్వాయర్లు నిండినప్పటికీ రబీ పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నామన్నారు. తెలుగు గంగ, కేసీ కాలువ ద్వారా స్థిరీకరించిన ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీ సిస్టం సరిగా లేకపోవడం వల్లే నీరు ఇవ్వడం లేదన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ కేసీ చివరి ఆయకట్టు వరకు నీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరిత రెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, సాగునీటి సంఘాల నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ. జనార్దన్ రెడ్డి
నంద్యాల: కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు రబీలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ రాజ కుమారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, తెలుగు గంగ ఆయకట్టుల్లో ఎంతమేరకు నీరు విడుదల చేయాలి అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా సమీక్షించామన్నారు. ఎస్సార్బీసీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు కొత్తగా నిర్మిస్తుండటంతో కేసీ ఆయకట్టుకు నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. 0–120, 120–150 కిలోమీటర్ల వరకు ఈ సీజన్‌లో నీటి విడుదల సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద సమస్య తలెత్తకుండా ముందుగానే తుంగభద్ర బోర్డు అత్యవసరంగా డ్యామ్ గేట్ల మరమ్మతులు చేపడుతుందన్నారు.