ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అరవై డైబ్బె మంది క్యూకట్టారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఫార్మసీ వద్ద కనిపించిన దృశ్యమిది. మంగళవారం కూడా ఓపీ రోగులు అధిక సంఖ్యలో వచ్చారు. చికిత్స తీసుకున్న రోగులు ప్రిస్క్రిప్షన్ చేతబట్టుకుని ఫార్మసి కౌంటర్ వద్దకు చేరుకున్నారు. సాధారణంగా ఫార్మసి కౌంటర్ షెడ్డు వరకే రోగుల రద్దీ ఉండేది. కానీ మంగళవారం షెడ్డు దాటి గైనిక్ ఓపీ వరకు క్యూ చేరుకుంది. రోగుల రద్దీకి అనుగుణంగా అదనపు ఫార్మసి కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శల కు తావిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే ఓపీ, డాక్టర్ వద్ద, వైద్యపరీక్షలు, ఇప్పుడు మందులు తీసుకోవడానికి క్యూలో ఉండలేక నీరసించిపోతున్నట్లు రోగులు వాపోయారు. – కర్నూలు(హాస్పిటల్)
నిరీక్షించి.. నీరసించి
నిరీక్షించి.. నీరసించి


