
పల్లె విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో సరైన విద్య అందడం ల
శిరివెళ్ల: ఒకటికాదు.. రెండు కాదు.. యాభై ఏళ్లుగా ప్రాథమిక విద్యను అందిస్తున్న పాఠశాల మూతబడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిరివెళ్ల మండలం మోత్కలపల్లెలో 435 ఇళ్లు ఉండా..1,200 మంది నివాసం ఉంటున్నారు. అందులో ఎస్సీ, బీసీలే అధికం. గ్రామంలో 50 ఏళ్ల క్రితం ఆర్‌సీఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ప్రారంభం కాగా ..అందులో ఐదో తరగతి వరకు చదివి చాలా మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా వారిలో ఒకరు రెండేళ్ల క్రితం, మరొకరు ఈ ఏడాడి మే నెలలో పదవీ విరమణ పొందారు. మొత్తం 45 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను మూతవేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మహానంది మండలం మసీదుపురం, గోస్పాడు మండలం దీబగుంట్ల ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించారు. ప్రతి రోజు విద్యార్థులు ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రెండు నుంచి మూడు పాఠశాలు ఉన్నాయి. ఒక పాఠశాల మూత పడితే మరో పాఠశాలలో విద్యార్థులు చేరుతారు. మోత్కలపల్లె గ్రామంలో ఉన్న ఒక పాఠశాల మూతపడితే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని సర్పంచ్ భూమా వేణుగోపాలరెడ్డి తెలిపారు.

పల్లె విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో సరైన విద్య అందడం ల