నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

Jun 28 2025 5:29 AM | Updated on Jun 28 2025 8:49 AM

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కోఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికై న వారిని జెడ్పీ స్థాయీ సంఘ కమిటీల్లో సభ్యునిగా నియమించేందుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అనంతరం వ్యవసాయం – అనుబంధ శాఖలు, వైద్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సమావేశాని కంటే ముందు ఉదయం 9 గంటలకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement