
చెత్త రహిత జిల్లాగా మార్చాలి
నంద్యాల: అధికారులు నిబద్ధతతో పని చేసి చెత్త రహిత జిల్లా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ 2025పై ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శిలకు ఒకరోజు జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను పారిశుద్ధ్యపరంగా పరిశుభ్రంగా ఉండేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ టీమ్స్ రావడం జరుగుతోందన్నారు. అకడ మిక్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గ్రామాలను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తారని చెప్పారు. వైద్య సహాయం, ఆర్థిక సహాయం కోసం ప్రజలు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్‌లో అమలు చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పించారు. సమావేశంలో డీపీఓ లలితా బాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి డీఎల్‌పీఓ మంజుల వాణి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి