
మొబైల్ ‘మాల్’
ఈ చిత్రం చూస్తే ఏదో దుకాణం వద్ద ఇద్దరు నిల్చున్నట్లుగా అనిపిస్తోంది కదూ.. కాస్తా పరిశీలనగా చూస్తే అది మొబైల్‘మాల్’ అని అర్థమవుతుంది. జీవన పోరాటంలో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి నాగేంద్ర కూడా ఉపాధి కోసం వినూత్నంగా ఆలోచించాడు. బేతంచెర్ల పట్టణం హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన ఇతను ఆటోను మొబైల్‌మాల్‌గా మార్చేశాడు. ప్లాస్టిక్ వస్తువులు, గాజులు, ఫ్యాన్సీ ఐటమ్స్, చట్నీలను ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. ఇతనికి అతని తల్లి ఈరమ్మ కూడా తోడు నిలిచింది. దాదాపు ఆరేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే దుకాణం ఉందా అన్నట్లుగా ఉంటుంది. దగ్గరకు వెళ్లి చూస్తే తప్ప ఆటో కనిపించదు. ఖర్చులు పోను వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని నాగేంద్ర చెబుతున్నాడు.
– బేతంచెర్ల

మొబైల్ ‘మాల్’