
శరీరం, మనస్సును సమన్వయం చేస్తుంది
మనసు చెప్పిన మాట శరీరం వినదు. శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే యోగా. నేను 14 ఏళ్లుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శరీరం దృఢంగా, మనసు స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. యోగా మనసుకు శాంతి, శరీరానికి ధృఢత్వం, చిత్తానికి ఓర్పు చేకూర్చే అద్భుత ప్రక్రియ. శరీరంలో మూసుకుపోతున్న ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. శరీరంలో ఎంజైమ్‌లు, హార్మోన్‌లు ఉత్తేజితం అవుతాయి. బరువును నియంత్రణలో ఉంచుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను, సయాటిక, థైరాయిడ్, కిడ్నీ, లివర్‌కు సంబంధించిన జబ్బులను నివారిస్తుంది.
– ఎల్.నరేష్‌గౌడ్, యోగా శిక్షకులు, కర్నూలు