
మిర్యాలగూడ వాసికి గౌరవ డాక్టరేట్
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని హనుమాన్‌పేటకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ పగిడిమర్రి గోవ ర్ధనాచారి చేస్తున్న సామాజిక వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటరర్నేషనల్ కల్చర్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి అకాడమి సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ మేరకు ఈనెల శనివారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ డాక్టర్ సుదర్శన్‌గౌడ్, గూడూరు చెన్నారెడ్డి, వందేమాతరం బృందం నుంచి గోవర్ధనాచారి ఈ వార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను 40ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని, పేదలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తాను చేస్తున్న వైద్య సేవలను గుర్తించిన ఏషియా వేదిక ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రిసేర్చ్ స్ఫూర్తి ఆకాడమి సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.