క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

Jun 23 2025 6:53 AM | Updated on Jun 23 2025 6:53 AM

క్రీడ

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

నల్లగొండ టూటౌన్‌: క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశానికి స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24,25 తేదీల్లో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి ఎం.డి అక్బర్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. 24న బాలికలకు, 25న బాలురకు నల్లగొండలోని మేకల అభినవ్‌ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి వివరాలకు సెల్‌ : 8074487020 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదు

నల్లగొండ: ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి.వెంకులు అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయా పాఠశాలల్లో బోధన స్తంభించిపోతుందన్నారు. మండల, ఉప విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

శివన్నగూడ రిజర్వాయర్‌ పనులు అడ్డగింత

మర్రిగూడ : శివన్నగూడ రిజర్వాయర్‌ పరిఽధిలో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు తమకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం గ్రామ సమీపంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు అందరితోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నిర్వాసితులు ఉన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలి

నల్లగొండ టూటౌన్‌: ఫుట్‌బాల్‌ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అక్బర్‌ అలీ అన్నారు. ఈ నెల 28 నుంచి జూలై ఒకటవ తేదీ వరకు నిజామాబాద్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఆదివారం ఔట్‌డోర్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్‌ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జి.కర్తయ్య, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా చైర్మన్‌ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు బండారు ప్రసాద్‌, గిరిబాబు, కవిత, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
1
1/1

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement