
సూర్యాపేట డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విచారణ
సూర్యాపేటటౌన్: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం సభ్యులు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్సనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్, డిప్యూటీ సీఎస్ పీసీపీ ఎన్డీటీ డాక్టర్ సుమిత్రా రాణి, డిపూఓ్యటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మిన్ శ్వేతా మోహన్.. డీఎంహెచ్‌ఓ కోటాచలాన్ని విచారించారు. సూర్యాపేటలో నాలుగు ఆస్పత్రుల పర్మిషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిశీలన అనంతరం తీసుకునే చర్యల సంబంధిత వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిస్తామన్నారు.

సూర్యాపేట డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విచారణ