
కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. భార్య మృతి
చివ్వెంల(సూర్యాపేట): ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా.. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన భృగుమళ్ల హరీష్, అతని భార్య కళ్యాణి (32) కారులో ఖమ్మంకు వెళ్తుండగా మార్గమధ్యలో చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణి తలకు, చాతిలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హరీష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
భర్తకు గాయాలు