
ఆకటు్టకోనున్న శిల్ప కళ
యాదగిరిగుట్ట : హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాలకు చెందిన 10మంది సుందరీమణులు గురువారం యాదగిరిగుట్టను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా నల్లరాతి శిల్పాలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న యాదగిరీశుడి ఆలయాన్ని అందాల భామలు పరిశీలించి ఇక్కడే ఫొటో షూట్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా డాక్యుమెంటరీ చిత్రీకరించి విశ్వ వ్యాప్తంగా యాదగిరి క్షేత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎటు చూసినా ఆధ్యాత్మిక భావనే..
యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలో ఎటూ చూసినా అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి. తూర్పు రాజగోపుర మహాద్వారం నుంచి ఆలయంలోని ప్రవేశించినప్పటి నుంచి సుందరీమణులను గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లనుంది. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే క్రమంలో మెట్లకు ఇరువైపులా గల శంకు చక్ర నామాలు, దశావతారాలు, హనుమంతుడు, గరుడ్మంతుడు, పంచనారసింహులు, రామానుజులు, యాదవ మహార్షి, ప్రహ్లాదుడు, మహా విష్ణువు, అష్టలక్ష్మి శిల్పాలతో ఆలయానికి ప్రత్యేక కళ వచ్చింది. మెట్లదారికి ఇరువైపులా చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇన్నర్, ఔటర్ ప్రాకారాల్లో ఏర్పాటు చేసిన యాలీ ఫిలర్లు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాల్లో పొందుపర్చిన దేవతామూర్తుల విగ్రహాలు, గర్భాలయం ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను పంచలోహ శిల్పాలు సుందరీమణులను ఆకట్టుకోనున్నాయి. ఆలయంలోని ప్రతి పిల్లర్‌కు ఒక్కో ఆళ్వారుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెరి ఆళ్వార్, పెగయ్ ఆళ్వార్, భూదత్ ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్, నంబి ఆళ్వార్, పే ఆళ్వార్, కులసేఖర్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తొండర పొడియా ఆళ్వార్, ఆండాల్ అమ్మవార్ల విగ్రహాలు, ఆళ్వార్ పిల్లర్ల పైన కాకతీయ శైలితో స్తంభాలను నెలకొల్పిన తీరు అందాల భామలను కనువిందు చేయనున్నాయి.
రేపు యాదగిరిగుట్టకు రానున్న
సుందరీమణులు

ఆకటు్టకోనున్న శిల్ప కళ

ఆకటు్టకోనున్న శిల్ప కళ