
కార్మిక రంగం బలోపేతానికి కృషి చేయాలి
నాంపల్లి: కార్మిక రంగం బలోపేతానికి కేంద్రం కృషిచేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మద్దతు ధర కల్పించేందుకు గాను చట్టం తేచ్చేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికే రూ.లక్ష కోట్లు కేటాయించిందని, డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి డిండి ఎత్తిపోత పథకానికి నిధులు కేటాయించి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నం చేసిందన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎనుకున్నారు. మండల కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా సూదనబోయిన రమేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాగిపాణి ఆంజాచారి, రమేష్, జగన్, గిరి, రమా, కోరె సత్తయ్య, మహేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
పల్లా వెంకట్‌రెడ్డి