
డిండి వాసికి 66వ ర్యాంకు
డిండి: డిండి మండల కేంద్రానికి చెందిన వంగాల కవిత, ప్రభాకర్‌రెడ్డి దంపతుల కుమారుడు వంగాల ప్రణీత్‌రెడ్డి ఆదివారం వెలువడిన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 66వ ర్యాంకు సాధించాడు. ప్రణీత్‌రెడ్డి హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో గల నారాయణ కళాశాలలో ఇంటర్ చదివాడు. వంగాల ప్రభాకర్‌రెడ్డి విద్యుత్ ఏఈగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక ప్రొడక్ట్ తయారుచేసి అతి తక్కువ ధరకు దేశ ప్రజలకు అందించి తన వంతు సమాజానికి ఉపయోగపడాలన్నదే లక్ష్యమని ప్రణీత్‌రెడ్డి తెలిపారు. ఈఏపీసెట్‌లో ప్రణీత్‌రెడ్డి మంచి ర్యాంకు సాధించిడం ఎంతో ఆనందంగా ఉందని అతడి తల్లిదండ్రులు కవిత, ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.