
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
తిప్పర్తి: అతివేగంగా వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అనంతరం ఆ కారుపై విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఈ ఘటన తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో గుంటూరుకు వెళ్లి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడిపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
కారుపై విరిగిపడిన విద్యుత్ స్తంభం