
నీట్ పరీక్షకు ఏడు కేంద్రాలు
నల్లగొండ : నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలోని ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్‌పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నాలుగు కేంద్రాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, కేంద్రియ విద్యాలయంలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 2087 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు.
పెన్ను కూడా కేంద్రంలోనే ఇస్తారు..
నీట్ రాసే విద్యార్థులు పెన్ను కూడా పరీక్ష కేంద్రంలోనే ఇస్తారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు వేసుకుని రావొద్దని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రి బాక్సులు, మొబైల్స్, బ్లూటూత్, వాలెట్, రిస్ట్‌వాచ్, కెమెరా, బెల్ట్, గగూల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, కాలిక్యులేటర్ వంటివి పరీక్ష కేంద్రంలోని అనుమతించమని తెలిపారు. అభ్యర్థులు ఇటీవల దిగిన కలర్ పాస్ పోర్ట్‌సైజ్ ఫొటో ఒకటి, పోస్టుకార్డు సైజ్ కలర్ ఫొటో, గుర్తింపు కోసం డ్రైవింగ్‌లైసెన్స్, ఆధార్‌కార్డు, కళాశాల జారీ చేసిన గుర్తింపుకార్డు, ఇతర ఏదేని గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్‌కుమార్, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి