కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి | - | Sakshi
Sakshi News home page

కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి

May 2 2025 1:43 AM | Updated on May 2 2025 1:43 AM

కాలుష

కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి

క్యాంపస్‌ సమాచారం

నల్లగొండ టూటౌన్‌: నానో పార్టికల్స్‌ సహాయంలో నీటిలోని పెస్టిసైడ్స్‌ను తొలగించి నీటిని కాలుష్యరహితంగా మార్చి చెరువుల్లో ఉండే జీవరాశులను కాపాడేందుకు కృషి చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. ఎంజీయూలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీలో రీసెర్చ్‌ స్కాలర్‌ వి.శ్రీధర్‌ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వై. ప్రశాంతి ఆధ్వర్యంలో ‘కిటాలసిస్‌ అండ్‌ బయోలాజికల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ మెటల్‌ ఆకై ్సడ్‌ నానో పార్టికల్స్‌’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన శ్రీధర్‌ను వీసీ చాంబర్‌లో వీసీ, రిజిస్ట్రార్‌ అల్వాల రవి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వసంత, రూప, రమేష్‌, జ్యోతి, కళ్యాణి, శ్రీధర్‌రావు, శంకరాచారి, అమరేందర్‌, తిరుపతి, అభిలాష, శ్వేత, మహతి, పరిమళ తదితరులు పాల్గొన్నారు.

బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

నల్లగొండ టూటౌన్‌: మహాత్మాగాంధీ యూ నివర్సిటీ పరిధిలో బీఈడీ ఒకటవ, మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ గురువారం విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని, విద్యార్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సీఓఈ డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపిక

నల్లగొండ టూటౌన్‌: నానో సాంకేతికత, జీవరసాయన శాస్త్ర పరిశోధనల్లో విశేష కృషి చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం. రాంచందర్‌గౌడ్‌ మలేషియాలో జూన్‌లో జరిగే అంతర్జాతీయ శాసీ్త్రయ సదస్సుకు ఎంపికయ్యారు. ‘నానోకణాలు, జీవ అణువుల మధ్య జీవ భౌతిక పరస్పర చర్యలు’ అనే అంశంపై రాంచందర్‌గౌడ్‌ రచించిన పరిశోధనా వ్యాసాన్ని ఈ సదస్సులో పాల్గొని వివరించనున్నారు. ఆయన పరిశోధనలు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే దిశగా, నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా ఉన్నట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. రాంచందర్‌గౌడ్‌కు వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అల్వాల రవి అభినందనలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ

వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌

కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి1
1/1

కాలుష్య రహిత చెరువులుగా మార్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement