నాగార్జునసాగర్ : రాష్ట్రంలో ఇళ్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు ఏప్రిల్ నుంచి పోర్టల్ ఓపెన్ అవుతుందని.. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపల్ సమావేశం అనంతరం ఆయన కాలనీల్లోని ఇళ్లను ఎన్‌ఎస్పీ అధికారులతో కలిసి సందర్శించారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు నుంచి ఇళ్లలో నివాసముండే వారికి నిబంధనల మేరకు ఇళ్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. జీఓ 58, 59 ప్రకారం నివాసితులకు ఇళ్ల క్రమబద్ధీకరించేందుకు 2020 జూన్ 2 వరకు గడువును పొడిగించిందని తెలిపారు. గతంలో దరకాస్తు చేసుకున్న వారిలో అర్హుౖలకు త్వరలో డి మాండ్ నోటీసులు అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట సాగర్ ప్రాజెక్టు ఈఈ మల్లికా ర్జున్, డీఈ నివాస్, ఏఈ బిక్షం ఉన్నారు.