
కాల్వలోకి కొట్టుకుపోతున్న ధాన్యం
పెన్‌పహాడ్: ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ధాన్యం నీటి పాలైన సంఘటన మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన మట్టపల్లి వెంకన్న ట్రాక్టర్‌లో ధాన్యాన్ని మిర్యాలగూడలోని మిల్లుకు తరలిస్తుండగా దోసపహాడ్ గ్రామ శివారులో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ధాన్యం కాల్వలోకి జారిపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టిపడి పండించిన పంట నీటిపాలవ్వడంతో ఆ రైతు కన్నీరుమున్నీరయ్యాడు.