
మెప్మా ఆధ్వర్యంలో..
జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలతో 7,28,000 మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలు రూపొందించారు. గత నెలలోనే అన్ని పురపాలికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటేందుకు స్థల సేకరణ సైతం పూర్తిచేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలు నిర్వహించే మహిళా సంఘాల సభ్యులను అమృత్ మిత్రలుగా పిలవనున్నారు. అయితే మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాల్సి ఉండగా.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో అడుగు పడలేదు.