మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ క్రైం: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ చరిత్రను కాపాడుకుందామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఎంపీ మల్లురవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. ముస్లింల తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా చదివించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించాలన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మరో రూ.2 వేల కోట్లను కేటాయించి బ్యాంకుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేలను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గద్వాల జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.