
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి
మహబూబ్‌నగర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్‌ను జాలీడేస్‌గా మార్చేస్తోంది.

పాలమూరు అందాలు చూసొదా్దం