రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

Mar 10 2025 10:20 AM | Updated on Mar 10 2025 10:18 AM

వెల్దండ: మండలంలోని గుండాలలో శ్రీఅంబా రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు శివపార్వతులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు శివకుమార్‌ శర్మ, నరహరి శర్మ, సంతోష్‌ శర్మ, సురేష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా

అభివృద్ధి సాధించాలి

నాగర్‌కర్నూల్‌రూరల్‌: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎంఎస్‌ఎంఏఈ ద్వారా కుట్టు శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మాజీ కౌన్సిలర్‌ కొత్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జీపీ కార్మికులకు రూ.26వేల వేతనం ఇవ్వాలి

చారకొండ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెల శుభ్రత కోసం కార్మికులు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీయూ మండల కార్యదర్శి బాలస్వామి, గెల్వయ్య, మల్లయ్య, వెంకటేశ్‌, మొగులమ్మ, శేఖర్‌, రాంకోటి తదితరులు ఉన్నారు.

వేరుశనగ @ 6,969

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఆదివారం 113 మంది రైతులు 2,026 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 6,969, కనిష్టంగా రూ. 5,206, సరాసరి రూ. 6,312 ధరలు వచ్చాయి. అదే విధంగా 14 మంది రైతులు 112 బస్తాల కందులను అమ్మకానికి తీసుకురాగా.. రూ. 6,999 ధర పలికింది.

రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు 
1
1/1

రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement