కొన్ని పనులకే పరిమితం | - | Sakshi
Sakshi News home page

కొన్ని పనులకే పరిమితం

Mar 9 2025 12:35 AM | Updated on Mar 9 2025 12:35 AM

కొన్న

కొన్ని పనులకే పరిమితం

ఉప్పునుంతల: జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏయే పనులు చేసుకోవచ్చు.. ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చనే.. కనీస అవగాహన లేక ప్రతిఏటా చేసిన ఆ ఐదారు రకాల పనులే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆయా పనులపై రైతులకు, కూలీలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికార యంత్రాంగం. ఈ పథకంలో దాదాపుగా 266 రకాల పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్నా అందులో పట్టుమని పదికి మించి పనులు చేపట్టడం లేదు. 2006లో ఈజీఎస్‌ పథకం ప్రారంభమై దాదాపుగా 19 ఏళ్లు కావొస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపచెట్లు తొలగించడం, భూమి చదును చేసుకోవడం వంటి నామమాత్రపు పనులే ప్రధానంగా కనపిస్తున్నాయి తప్పా ఇతర పనులతో ప్రయోజనం పొందడం లేదు. పనుల ఎంపికపై ఏడాదిలో ఒక్కరోజు గ్రామసభలు నిర్వహించి.. రైతులు, కూలీల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం అందుకు కారణమవుతుంది. దీంతో పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్‌ వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. గత రెండు వారాలుగా కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే పలు రకాల పనులు ఉన్నాయి. కంపోస్టు ఎరువు గుంత, వ్యవసాయ పొలాల్లో పంట నూర్పిడి కళ్లాలు, వ్యవసాయ పొలాల్లోకి రోడ్లు వేసుకోవడం, భూ ఉపరితల నీటి కుంటలు, కొత్త సేద్యపు బావుల తవ్వకం, వర్మీ కంపోస్టు పిట్‌లు, కొత్తగా పంట కాల్వల ఏర్పాటు, ఉమ్మడి భూముల్లో పశువుల నీటి కోసం కుంటల నిర్మాణం, పశువులు, జీవాల తాగునీటి తొట్టీల నిర్మాణాలు, పశువులు, మేకల పాకలు, కోళ్ల ఫారం నిర్మాణాలు, గడ్డి పెంపకం, భూమి సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వడం, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణాలు, శ్మశాన వాటికల స్థలాల అభివృద్ధి, శ్మశాన వాటికల వద్దకు రోడ్లను వేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో రహదారుల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, రైతుల పంట పొలాల గట్లపై మొక్కల పెంపకం, తాటి వనాల పెంపకం వంటి పలు రకాల పనులను చేపట్టి రైతులు వ్యక్తిగతం గాను, సామూహికంగా ఈజీఎస్‌లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు పూర్తిస్థాయిలో ఈజీఎస్‌లో చేసుకునే అవకాశం ఉన్న పనులపై రైతులు, కూలీలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ ఏడాది

పనిదినాల లక్ష్యం 38.30 లక్షలు

గ్రామసభల్లో వివరిస్తున్నాం..

ఈజీఎస్‌లో పనుల ఎంపిక కోసం అక్టోబర్‌ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి పూర్తిగా పనుల వివరాలను వివరిస్తున్నాం. పథకంలో నిర్దేశించిన పనులు చేసుకోవడానికి ముందుకు వచ్చే రైతుల పొలాల్లో పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. జాబు కార్డు కలిగి ఉండి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్నకారు రైతులు తాము చేయించుకోదలిచిన పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా దరఖాస్తు చేసుకుంటే పనులు చేయిస్తాం. జాబ్‌కార్డులేని కూలీలు దరఖాస్తు చేసుకుంటే జాబ్‌కార్డులు అందజేసి పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పశువుల మేతగా అజోలా పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, పశువుల పాక నిర్మాణం వంటివి ఈజీఎస్‌లో ప్రోత్సహిస్తున్నాం. – సుదర్శన్‌గౌడ్‌, ఈజీఎస్‌ ఏపీఓ,

ఉప్పునుంతల మండలం

అవగాహన లేకనే..

జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎన్నో రకాల పనులు చేసుకునే అవకాశం ఉన్నా మాకు తెలియకపోవడంతో ప్రయోజనం పొందలేకపోతున్నాం. గ్రామాలు, తండాల్లో వారం రోజులు గ్రామసభలు నిర్వహించి ఈజీఎస్‌లో చేసుకునే అవకాశం ఉన్న పనులపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఇన్నేళ్లు గడిచినా ఈజీఎస్‌తో మేం ఏమాత్రం ప్రయోజనం పొందలేదు. ఇప్పటికై నా మాలో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే వాటిని ఉపయోగించుకుంటాం.

– పూల్యానాయక్‌, రైతు, గుట్టమీదితండా, ఉప్పునుంతల మండలం

ప్రయోజనం చేకూర్చే పనులెన్నో..

యాక్టివ్‌గా

ఉన్నవి 1,10,095

మొత్తం జాబ్‌

కార్డులు

1,94,725

గ్రామాల్లో ఈజీఎస్‌పై కొరవడిన అవగాహన

ప్రయోజనం చేకూర్చేలా

266 రకాల పనులు

ఐదారింటితోనే సరిపెట్టుకుంటున్న రైతులు, కూలీలు

పట్టింపులేని అధికారులు, ప్రజాప్రతినిధులు

పనిచేస్తున్న

కూలీలు 1,81,605

కొన్ని పనులకే పరిమితం 1
1/2

కొన్ని పనులకే పరిమితం

కొన్ని పనులకే పరిమితం 2
2/2

కొన్ని పనులకే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement